![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -94 లో......రామరాజు కుటుంబం చందుకి మంచి సంబంధం దొరుకుందేమోనని స్వయంవరానికి వస్తారు. భాగ్యం కుటుంబం కూడా స్వయంవరానికి ఎవరైనా కోటీశ్వరులు వస్తారేమో చూద్దామని వస్తారు. స్వయం వరం లో భాగ్యం అందరి అబ్బాయిలని రిజెక్ట్ చేస్తుంది. చందు స్టేజ్ పైకి వెళ్లి తన గురించి చెప్తూ ఇంట్లో వాళ్ళను పరిచయం చేస్తాడు. నాకు కాబోయే పెళ్ళాం అందంగా ఉండాలంటూ నాకూ కోరికలు ఏం లెవ్వు కానీ నా పేరెంట్స్ ని వాళ్ల పేరెంట్స్ గా చూడాలని చందు చెప్తాడు.
అదంతా వింటున్న భాగ్యం వీడెవడో బకరా దొరికాడు.. నువ్వు స్టేజ్ పైకి వెళ్లి వాళ్లకు నచ్చేలా మాట్లాడమని శ్రీవల్లిని భాగ్యం పంపిస్తుంది. నాకు ఉమ్మడి కుటుంబం అంటే చాలా ఇష్టం.. అత్తామామలని అమ్మనాన్నలుగా చూసుకుంటానని శ్రీవల్లి అంటుంటే.. రామరాజు కుటుంబం ఇంప్రెస్స్ అవుతుంది. ఈ అమ్మాయే చందుకి కాబోయే భార్య అని రామరాజు చెప్తాడు. ఆ తర్వాత రామరాజు కుటుంబం భాగ్యం కుటుంబాలు కూర్చొని సంబంధం మాట్లాడుకుంటారు. సాగర్, ధీరజ్ , ప్రేమ వివాహల గురించి రామరాజు చెప్తాడు. తన ఆస్తుల గురించి చెప్పగానే భాగ్యం షాక్ అవుతుంది. బానే సంపాదించారని అంటుంది. మేమ్ కూడా రిచ్ అంటు భాగ్యం అబద్దం చెప్తుంది. ఫైనాన్స్ చేస్తాం మాకు సంతకాలు చెయ్యడానికే టైమ్ ఉండదని గొప్పలు చెప్తుంది.
మీ ఆస్తుల గురించి చెప్పండి అని నర్మద అంటుంది. ఈ పిల్ల తెలివైనా పిల్లలాగా ఉందంటూ భాగ్యం డైవర్ట్ చేస్తుంది. మంచి రోజు చూసుకొని ముహూర్తం పెట్టుకోవాలని భాగ్యం చెప్పి వెళ్ళిపోతుంది. వీళ్ళ మాటలు ఏదో తేడాగా ఉన్నాయని నర్మద అనుకుంటుంది. మరొకవైపు ధీరజ్, ప్రేమలు కలిసి కళ్యాణ్ దగ్గరికి వెళ్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |